MBNR: బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి. జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.