AP: వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి లాయర్, టీడీపీ లాయర్ ఒక్కరేనని మాజీమంత్రి రోజా తెలిపారు. వివేకా హత్యలో టీడీపీ హస్తముందని ఆరోపించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టే రోజు టీడీపీ మహిళలంతా ఢిల్లీకి వెళ్లారని.. బిల్లు వీగిపోయాక సాయంత్రం పార్టీ చేసుకున్నారని పేర్కొన్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి కారణమైన కాంగ్రెస్ సీఎం రేవంత్ ఇచ్చిన పార్టీకి వారు హాజరయ్యారని వాపోయారు.