SRD: జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 132 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు (LKG, UKG) మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే తరగతి గదులను సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. జూన్ 12 నుంచి తరగతులను ప్రారంభిస్తామన్నారు.