KMM: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రద్దీనీ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సబ్ రిజిస్టార్ కార్యాలయాల వేళలు పొడిగించారు. మే 29 నుంచి జూన్ 3 వరకు ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆఫీసులు పని చేస్తాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని తెలిపారు.