ప్రకాశం: ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ నేతలు మార్కాపురంలో ఘనంగా నిర్వహించారు. దోర్నాల బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకట్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంటక సుబ్బారెడ్డి పాల్గొన్నారు