ATP: అనంతపురం నగరంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల, జడ్పీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నాయకులు పూల నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలకు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.