చిత్తూరు జిల్లాలోని కేజీబీవీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ప్రిన్సిపల్ 1, సీఆర్టీ ఫిజికల్ సైన్స్ 2, సీఆర్టీ సోషల్ 1, పీఈటీ 1 పోస్టులు ఉన్నాయని తెలిపారు. జూన్ 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.