మంచిర్యాల జిల్లాలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులపై విస్తృత అవగాహన కల్పించాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ప్రజలను చైతన్య పరచడానికి ప్రచార సామాగ్రి, పోస్టల్ కరపత్రాల ముద్రణకు నిధులు మంజూరు చేయాలన్నారు.