TG: రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్‌కు పార్లమెంట్లో కీలక పదవి దక్కింది. ఆయనను రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ సభ్యుల వసతులు, నివాస గృహాల కేటాయింపు వంటి వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. లక్ష్మణ్ నియామకంపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.