పంజాబ్& సింధ్ బ్యాంకులో 635 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో 40 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-28 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12,300 చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6. వెబ్సైట్: https://punjabandsind.bank.in/