TPT: గుంటూరుకు చెందిన మాదాల శేషగిరిరావు టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 10,01,116 విరాళంగా అందించారు. అదే విధంగా గుంటూరుకు చెందిన మిత్రేష్ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళం ఇచ్చారు. దాతలు రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు పాల్గొన్నారు.