BDK: అశ్వారావుపేట మండలం వినాయకపురం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఎస్సై యయాతీ రాజు వివరాల ప్రకారం.. శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు ఈ దాడి జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ. 1800 నగదును స్వాధీనం తీసుకున్నామని ఆయన తెలిపారు.