NGKL: జిల్లా కలెక్టరేట్లో ఇవాళ ఉదయం 9 గంటలకు నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక సమీక్ష సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, పెండింగ్ పనులు, సాగునీటి అందుబాటు అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
Tags :