AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ లో వార్డుల విభజన గందరగోళంగా ఉందని వైసీపీ నాయకులు అన్నారు. వెంటనే సరి చేయాలని కోరుతూ ఆదివారం జోనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. స్థానిక రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి నాయకులు ప్రదర్శనగా జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామ్ మాట్లాడుతూ.. పారదర్శకత లేకుండా విభజన సరికాదన్నారు.