VZM: వాహనదారులు దీర్ణకాలంగా పెండింగ్లో ఉన్న చలాన్లలను వెంటనే క్లియర్ చేసుకోవాలని వంగర SI షేక్ శంకర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వంగరలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దీర్షకాలంలో పెండింగ్లో ఉన్న 12 మంది వాహనదారులతో రూ. 5, 320ల చలానలను కట్టించారు. అయన మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు నియమావళి పాటిస్తూ, వాహన పత్రాలు తమవెంట ఉంచుకోవాలన్నారు.