SRPT: తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఆదివారం రాత్రి రావులపల్లి రోడ్డులోని ఐకేపీ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. రైతులు కోసిన వరి పంట పొలాలకు నిప్పు పెట్టడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.