KKD: గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించి సీట్లు పొందని విద్యార్థులకు ఈనెల 26 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త జి. రాజకుమారి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు బాలికలు, బాలురకు వేర్వేరు తేదీల్లో పి.వెంకటాపురం, లక్ష్మీనరసాపురం గురుకులాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు.