BHNG: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని BRS రాష్ట్ర నాయకుడు రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. ఆదివారం భువనగిరిలోని ఆయన మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి గుట్టకు రావడం ఐదోసారి. జిల్లా అభివృద్ధికి రూ.400 నుంచి 500 కోట్లు ప్రకటిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారుల ప్రోటోకాల్ లోపం వల్ల CM ఒక మాట కూడా మాట్లాడకుండా మొహం చాటేసి వెనుదిరిగారన్నారు.