ADB: నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాధిక హెచ్చరించారు. తాంసి మండలంలోని గిరిగామ గ్రామానికి చెందిన శివదాస్ ఆదివారం మహారాష్ట్ర నుంచి దేశిదారు అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 80 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.