GNTR: తెనాలి 23వ వార్డు పరిమి రోడ్డులో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు వారాల పాటు చెత్త తొలగింపు, కాలువల శుభ్రత, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు.