PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలో శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతినడంతో అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇవాళ మరమ్మతు పనులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు వేగంగా చర్యలు కొనసాగిస్తున్నారు.