BPT: సంతమాగులూరు స్థానిక శాఖ గ్రంథాలయంలో శనివారం 21వ రోజు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎన్ఎం పి. పూర్ణకుమారి ప్రస్తుత ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగినంత నీరు తాగాలని సూచించారు.