అన్నమయ్య: జిల్లాలో ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 23, 24 తేదీల్లో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి మురళీధర్ తెలిపారు. 23న ఉదయం 9 గంటలకు సీనియర్ పురుషుల జట్ల ఎంపిక, 24న జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.