ప.గో: జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు మట్టా వెంకట్ గౌడ్ నియమితులయ్యారు. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెంలో జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు వాక రాంగోపాల్ గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వెంకట్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.