HNK: హసన్పర్తి మండల కేంద్రంలో ఉపాధి కల్పించిన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన పనిమనిషిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మహేందర్ బుధవారం తెలిపారు. స్థానిక విశ్రాంత ఉద్యోగి కోటేశ్వర్ రావు ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న అశోక్, యజమాని తల్లి నిద్రిస్తున్న సమయంలో దాచుకున్న బంగారు పుస్తెలతాడును దొంగిలించి అమ్ముకున్నట్లు పోలీసులు తెలిపారు.