KRNL: కర్నూలు మండలం వెంకాయపల్లె శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన కమిటీ ఛైర్మన్గా భోగిని నాగేంద్ర ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన విష్ణువర్ధన్ రెడ్డికి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి బుధవారం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన ఛైర్మన్, కమిటీ సభ్యులను గ్రామస్థులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.