ATP: అమరావతిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం రెండో రోజు పోటీల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సందడి చేశారు. ‘ఆట విడుపు’ కార్యక్రమంలో భాగంగా సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ఉత్సాహంగా త్రో బాల్ ఆడారు. నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆమె పేర్కొన్నారు.