AP: మాజీ సీఎం జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి వెళ్తారు. అనంతరం ఇటీవల మరణించిన వైసీపీ స్థానిక నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు.