JGL: గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాల్వంతపూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల శ్రీ చరణ్ మృతి చెందాడు. ఎలక్ట్రిక్ స్కూటీపై పెగడపల్లి నుంచి వస్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.