GDWL: రైతులు దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్డప్ప, కుమార్, మధు నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.