వరంగల్ నగరంలోని కేఎంసీ మెడికల్ కళాశాల ప్రధాన రహదారిపై మంగళవారం స్కూటీ అదుపుతప్పి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెడికో పీజీ విద్యార్థి ప్రణయ్‌కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, అనంతరం అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.