GDWL: జిల్లాలో సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు గద్వాలలో బీసీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. వంటశాల, స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, సమస్యలు లేకుండా నిర్వహించాలన్నారు.