కోనసీమ: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆర్ఎస్ కుమార్ ఈశ్వరన్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది అభినందనలు తెలిపారు. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.