CTR: చిత్తూరులో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరులోని ఓ కళాశాలలో నూతనంగా నిర్మించిన మెస్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. కూలిన సమయంలో ఆ భవనంలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై సంబంధిత కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వాస్తు దోషం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు.