HNK: మహిళల రిజర్వేషన్లపై బీజేపీ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, 2023 మహిళా రిజర్వేషన్ బిల్లును యధావిధిగా అమలు చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమాదేవి అన్నారు. 31వ డివిజన్ సూర్జీత్ నగర్లో నిర్వహించిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను మహిళలు గమనించాలని అన్నారు.