ADB: ప్రతి సోమవారం ఆదిలాబాద్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 20న రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలియజేశారు. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాలు, వివిధ అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు.