MDK: శివంపేట మండలం పిల్లుట్లలో ఎదురవుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామ పంచాయతీ నడుం బిగించింది. సర్పంచ్ బుర్ర మురళి గౌడ్, పాలకవర్గ సభ్యుల చొరవతో ఆదివారం గ్రామంలో నూతన బోరుబావిని వేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉప సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.