ప్రకాశం: గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అగ్నిమాపక శాఖ అధికారులు ఆదివారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆసుపత్రి సిబ్బందికి దృశ్య రూపంలో వివరించి చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధైర్య పడకుండా ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలిపారు.