KDP: వాట్సాప్, వెబ్సైట్ ద్వారా పాలీసెట్ హాల్ టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ పాలెం గురుమూర్తి రెడ్డి తెలిపారు. పాలీసెట్ పరీక్ష ఈనెల 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారన్నారు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు పరిశీలించుకోవాలన్నారు.