బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కుమారుడు ఆరవ్ కెరీర్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆరవ్‌కు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ఫ్యాషన్ రంగంపై మక్కువతో ప్రస్తుతం ఒక ఉద్యోగం చేస్తున్నాడని తెలిపాడు. గ్రామాలను సందర్శిస్తూ అక్కడి ఫ్యాషన్ రీసెర్చ్ చేస్తున్నాడని, తన ఇష్టప్రకారమే సాగుతున్నాడని పేర్కొన్నాడు. పిల్లలకు అనవసర ఉపన్యాసాలు ఇవ్వనని స్పష్టం చేశాడు.