AP: కూటమి నేతలు పలు కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. ‘ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన సీఎం.. కూటమి నేతలకు వాటాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి ఇటీవల సీఎంను కలిశారు. ఆ తర్వాత అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జిందాల్ కంపెనీ వారిని కూడా ఇలాగే వేధించారు’ అని ఆరోపించారు.