NZB: జిల్లాలో వరిధాన్యం సేకరణ, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూం 08462-220183 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు.