SRPT: కోదాడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్డీవో సూర్యనారాయణ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహశీల్దార్ వాజీద్ అలీతో కలిసి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, కేంద్రాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.