AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో వీరిద్దరికీ బెయిల్ లభించింది.