కర్నూలు: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవి రాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఈ విషయంపై శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని వినతి పత్రం అందజేశారు.