SRCL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం మండల సభ నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ హాజరయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు, మహిళా సంఘాల బాధ్యులు, పాల్గొన్నారు.