KDP: వేముల సమీపంలోని జగనన్న కాలనీలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని తాగునీటి బోరుకు సంబంధించిన విద్యుత్ మోటార్ 10 రోజులుగా మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతుల అభ్యంతరాల నేపథ్యంలో, ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని వినియోగించుకుంటున్నారు.