చిత్తూరు పర్యటనలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తి నినాలా జయసూర్యను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తుల కోసం చిత్తూరు కోర్టులో నిర్వహించిన BNS సెక్షన్లపై ఒక రోజు శిక్షణా సదస్సులో గౌరవ న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎస్పీ R&B అతిథి గృహంలో ఆయనను కలిసి, గౌరవ సూచకంగా మొక్కను బహూకరించారు.