BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని అడిషనల్ డీజీపీ సుధీర్ బాబు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు సుధీర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో SP అక్షాన్స్ యాదవ్ కూడా పాల్గొన్నారు.