BDK: కొత్తగూడెం డా.ఏపీజే అబ్దుల్ కలాం కాలేజీలో నారి శక్తి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని తమ మద్దతును వ్యక్తం చేశారు. భారతదేశంలో మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత కీలకమని తెలిపారు. కాంగ్రెస్ కూటమి ఈ మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.